మైనార్టీ కోటాలో కో ఆప్షన్ ఇవ్వాలి

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీలో ముస్లిం మైనారిటీ కోటాలో తనకు కో ఆప్షన్ పదవి ఇవ్వాలని మండల కాంగ్రెస్ మైనారిటీ సెల్ నాయకులు ఎండీ జావేద్ కోరుతున్నారు. బుధవారం ఆయన ఆంధ్రప్రభ ప్రతినిధితో మాట్లాడుతూ.. తాను గత 10 సంవత్సరాలుగా ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ విభాగాల్లో పనిచేశానని, ఎమ్మెల్యే సామెల్, ఎంపీ చామల గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశానని, పార్టీకి కట్టుబడి పనిచేస్తున్నానని, యువజన నాయకునిగా తనను గుర్తించి మున్సిపల్ కో ఆప్షన్ పదవి తనకు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యే సామెల్ కి అనుచరుడిగా, ప్రియ శిష్యునిగా కొనసాగుతున్న జావేద్ కో ఆప్షన్ పదవి కోసం ఇప్పటికే ఎమ్మెల్యే సామెల్, ఎంపీ చామల, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను కలిసి విన్నవించినట్లు తెలిపారు. యువకులకు సైతం రాజకీయ పదవుల్లో (నామినేటెడ్ పోస్ట్) అవకాశం కల్పించాలని జావేద్ కోరారు.

Leave a Reply