ఆలేరులో చేనేత కార్మికులకు వైద్య శిబిరం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలోని గౌడ సంఘం భవనంలో గురువారం చేనేత కార్మికుల కోసం ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ ప్రారంభించారు. వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, కౌన్సిలర్లు, చేనేత కార్మిక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. వైద్యులు చేనేత కార్మికులకు పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు.

Leave a Reply