Telangana | గతంలో ఓడారు.. ఈ దఫా గెలిచారు..
Telangana | గతంలో ఓడారు.. ఈ దఫా గెలిచారు..
2, 5, 12.. వార్డుల్లో గెలిచిన ముగ్గురు..
Telangana, మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ లో గత ఎన్నికల్లో ఓటమి పాలైన ముగ్గురు అభ్యర్థులు ఈ దఫా మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందారు. 2 వ వార్డులో గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన కుర్మిళ్ల ప్రమీల రాములు ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 5 వ వార్డులో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన మొగుళ్ళ అనురాధ శ్రీనివాస్ రెడ్డి ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 12 వ వార్డులో గతంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమై పాలైన మెంట నగేష్ ఈ సారి మళ్లీ కాంగ్రెస్ తరపున తన భార్య రమణను బరిలో దింపి గెలుపొందారు.


