బీజేపీ నాయకుల పరామర్శ..

బీజేపీ నాయకుల పరామర్శ..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని తూర్పుగూడెం గ్రామంలో బీజేపీ కార్యకర్త పన్నీరు నర్సింహులు అకస్మాత్తుగా మరణించడంతో ఆ పార్టీ నాయకులు ఆ కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ ఆలేరు పట్టణ మండల అధ్యక్షులు పూజారి కుమారస్వామి గౌడ్, నంద గంగేష్ ఆధ్వర్యంలో మండల జనరల్ సెక్రెటరీ శేషత్వము అమరేందర్, మండల కార్యదర్శి బైరి మహేందర్ గౌడ్ కుటుంబానికి ఆర్థిక సాయం, 50 కేజీల బియ్యం అందజేశారు.

ఈ కార్యక్రమంలో తూర్పుగూడెం గ్రామ శాఖ అధ్యక్షులు గజరాజుల శంకర్ గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు బండి రాములు, మండల ఉపాధ్యక్షుడు సూదగాని సురేష్ , బీజేవైఎం నాయకులు చంద్రగిరి మహేష్, కొరికొప్పుల మనోహర్, గజరాజుల శివ, కొత్త శేఖర్, అందే కరుణాకర్, ఏండ్రు వెంకటేష్, అందె అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply