China | 21 మంది మృతి…

China | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో భారీ పేలుడు సంభవించి విషాదాన్ని మిగిల్చింది. బాణసంచా కర్మాగారంలో జరిగిన ఈ ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 61 మంది తీవ్రంగా గాయపడ్డారు.
పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో కర్మాగారం పూర్తిగా దెబ్బతిన్నట్లు సమాచారం. ఘటన వెంటనే అక్కడికి చేరుకున్న సహాయక బృందాలు రక్షణ చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు. అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
