పారిశుధ్య సేవల్లో ప్రతిభ కనబర్చిన సిబ్బందికి ముఖ్యమంత్రి సత్కారం

పారిశుధ్య సేవల్లో ప్రతిభ కనబర్చిన సిబ్బందికి ముఖ్యమంత్రి సత్కారం

నరసన్నపేట, ఆంధ్రప్రభ : స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య నిర్వహణలో విశేష సేవలు అందించిన పంచాయతీ సిబ్బందిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఘనంగా సత్కరించారు. స్వచ్చాంద్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి పంచాయతీ సిబ్బంది పి. జయంతి, దిల్లేశ్వరరావు, వై. రాజ్యలక్ష్మిలకు ప్రశంసాపత్రాలు, అవార్డులు అందజేశారు. అలాగే అనకాపల్లి పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్రీనివాసరావును కూడా అయన సేవలకు గాను సత్కరించి అవార్డు ప్రదానం చేశారు.

స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాల్లో భాగంగా కంబకాయ జెడ్పీహెచ్ పాఠశాలకు చెందిన భువనేశ్వరి, బోరిగివలస జెడ్పీహెచ్ పాఠశాలకు చెందిన రాజ్యలక్ష్మిల ఆధ్వర్యంలో విద్యార్థులతో చెత్త పారిశుధ్య అంశాలపై ప్రతిమలను తయారు చేయించారు. ఈ ప్రతిమలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.