చోరీ సంఘటనలో దొంగల ముఠా అరెస్టు

చోరీ సంఘటనలో దొంగల ముఠా అరెస్టు

నాలుగు క్రైమ్ బృందాలతో చాకచక్యంగా కేసు ఛేదన–
5 గురు నిందితుల అరెస్ట్, కేసు సొత్తు రికవరీ..,
జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : కాశీబుగ్గ పట్టణం నిత్యానందనగర్‌లో ఉన్న వెంకటేశ్వర జువెలరీ షాప్ లో జరిగిన డెకాయిటీ కేసును కాశీబుగ్గ పోలీసులు ఛేదించి, నిందితులను అరెస్ట్ చేసి, కేసుకు సంబంధించిన ముఖ్యమైన సొత్తును స్వాధీనం చేసినట్లు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు.

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ఈ కేసులో దోపిడి అయిన సొత్తు సుమారు 800 గ్రాముల బంగారు ఆభరణాలలో ,ర 243 గ్రాముల బంగారు ఆభరణాలు పాటుగా 9 ఎంఎం పిస్టల్, 5 కార్ట్రిడ్జులు ,7.65 ఎంఎం పిస్టల్, 2 మ్యాగజైన్లు, 11 కార్ట్రిడ్జులు, నగదు 3,41,000తో పాటుగా దోపిడి చేసిన సోత్తుతో కొనుగోలు చేసిన రెండు కార్లును,నేరం చేయడానికి ముందుగా కొనుగోలు చేసిన రెండు కార్లు,మొబైల్ ఫోన్లు – 12,మొత్తం రికవరీ విలువ: రూ. 49,00,000/- లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన డెకాయిటీ గ్యాంగ్ నింధితులను అరెస్టు కావల్సిందఅని,వారి వద్ద నుంచి కేసు ప్రాపర్టీ కూడా స్వాధీనం చేయవలసిందని తెలిపారు.

అరెస్ట్ అయిన నిందితులలో ఒడిస్సా రాష్ట్ర గంజాం జిల్లాకు చెందిన రామచంద్ర సాహు, ఖుర్దా జిల్లాకు చెందిన బనోజ్ బిహారి పట్నాయక్, కునా బరిక్, తపన్ మహారాణా, కాశీబుగ్గకు చెందిన పోట్నూరు తిరుమల పాత్రో ఉన్నారు. వీరిలో పోట్నూరు తిరుమల పాత్రో అనే వ్యక్తి దొంగ బంగారాన్ని కొనుగోలు చేసి పలు నగదు దుకాణాలకు విక్రయిస్తాడని, ఈ క్రమంలో కాశీబుగ్గలో పలుమార్లు రెక్కి చేసి దోపిడికి అనుకూలమైన నగదు దుకాణాన్ని ఎంచుకొని నిందితులు దోపిడీ చేయడం జరిగిందన్నారు.

కేసు దర్యాప్తులో, నిందితులు ఒడిశా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇదే తరహా దోపిడి, డెకాయిటీ నేరాలకు పాల్పడిన అనుభవం కలిగినవారని వెల్లడైందని ఎస్పీ తెలిపారు. వీరి మీద ఇప్పటివరకు ఒడిషా రాష్ట్రంలో 32 కేసులు నమోదైనట్లు గుర్తించడం జరిగిందనారు. కొంతమంది నిందితులు ఇప్పటికే అరెస్టై జైలు శిక్ష అనుభవించారని తెలిపారు . నేరాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేయడం, సాంకేతిక పద్ధతులను వినియోగించడం వీరి ప్రత్యేక లక్షణమన్నారు.

ఫిర్యాది అయిన కిల్లంసెట్టి రామకృష్ణారావు నిత్యానందనగర్‌లో శ్రీ వెంకటేశ్వర జువెలరీ పేరిట బంగారం దుకాణం నిర్వహిస్తున్నారని, ఆయన సాధారణంగా షాప్‌లో ఒక్కడే ఉంటారని, గతనెల మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో, సుమారు ఏడు గురు వ్యక్తులు, నెంబర్ ప్లేట్లు లేని మూడు మోటార్ సైకిళ్లపై షాప్ వద్దకు వచ్చారని,. వారు తమను జిఎస్టి అధికారులుగా చెప్పుకుని షాప్ తనిఖీ చేయాలంటూ లోపలికి ప్రవేశించారని,. షాప్‌లోకి వెళ్లిన తరువాత, వారు చేతులకు గ్లౌజులు, ముఖాలకు మాస్కులు ధరించి, అక్కడ ఉన్న సీసీ కెమెరాలపై నల్ల స్ప్రే పిచికారీ చేసి పనిచేయకుండా చేశారన్నారు .

అనంతరం ఫిర్యాదిదారుడి చేతులకు హ్యాండ్‌కఫ్స్ వేయడంతో పాటు పిస్టల్‌తో బెదిరించి, షాప్‌లో ఉన్న బంగారు ఆభరణాలను దోచుకుని అక్కడి నుండి పరారయ్యారని ఎస్పీ వివరించారు. ఈ బంగారం దుకాణాన్ని దోపిడి చేయాలనే ఉద్దేశంతో, కాశీబుగ్గకు చెందిన తిరుమల పాత్రో, కునా బరిక్ హాయంతో గత ఏడాది డిసెంబర్ 25, ఈ సంవత్సరం మార్చి నెలల్లో రెండు సార్లు షాప్‌పై రేకీ నిర్వహించారన్నారు. తరువాత, వీరిద్దరూ మిగిలిన నిందితులను కాశీబుగ్గకు తీసుకువచ్చి, ఆ గోల్డ్ షాప్‌పై మరోసారి రేకీ నిర్వహించారని,.

ఈ సందర్భంగా, కాశీబుగ్గలో నివసిస్తున్న తిరుమల పాత్రో షాప్ దోపిడి చేయడానికి అవసరమైన మార్గాలు (రూట్ మ్యాప్), ఇతర వివరాలను నిందితులకు అందించి సహకరించాడని ఎస్పీ తెలిపారు .ఏప్రిల్ 5న నేరం చేయడానికి ప్రయత్నించినప్పటికీ షాపు వేగంగా మూసివేయడం వలన మరుసటి రోజు ఏప్రిల్ 7వ తేదీన పథకం ప్రకారం నేరం చేశారని,.నేరం చేసే సమయంలో, సీసీ కెమెరాలకు చిక్కకుండా ఉండేందుకు, అలాగే టోల్ గేట్ల మార్గాలను తప్పించుకునేందుకు, నిందితులు భువనేశ్వర్ నుండి బయలుదేరి కురుధా, ఆస్కా, దిగబండి, మహేంద్రగిరి, లావణ్యకోట, గండహాతి, గరబండ, గొప్పిలి, పెద్దాంచల, చిన్నాంచల, కేదారిపురం మార్గంగా ప్రయాణించారని ఎస్పీ వివరించారు.

మొత్తం మూడు మోటార్ సైకిళ్లు, ఒక కారులో ప్రయాణించి, ఆ కారును కేదారిపురం గ్రామం సమీపంలోని లేఅవుట్ ప్రాంతంలో నిలిపి, అక్కడి నుండి మోటార్ సైకిళ్లపై కాశీబుగ్గ పట్టణానికి చేరుకున్నారని,.తరువాత, ముందుగా రేకీ చేసిన గోల్డ్ షాప్‌లోకి ప్రవేశించి, యజమానికి హ్యాండ్‌కఫ్స్ వేసి, పిస్టల్స్‌తో బెదిరించి, షాప్‌లో ఉన్న బంగారు ఆభరణాలను దోచుకుని అక్కడి నుండి పరారయ్యారన్నారు. ఈ కేసును ప్రత్యేక నాలుగు పోలీసు బృందాలు సాంకేతిక ఆధారాల సహాయంతో చేదించారని,. ఓ బ్యాంకు వద్ద సీసీ కెమెరాల ద్వారా వాహనాలను గుర్తించారని,.అనంతరం వాహనాల కొనుగోలు వివరాలు, ఫైనాన్స్ సంస్థలు ఇచ్చిన సమాచారం సేకరించారని, ఆధార్, మొబైల్ నంబర్ల ఆధారంగా నిందితులను గుర్తించారని, దాంతో గ్యాంగ్ మొత్తం నెట్వర్క్‌ను వెలికితీసి నిందితులను అరెస్ట్ చేశారని ఎస్పీ తెలిపారు.

ప్రతిభకు ప్రశంస…అదనపు ఎస్పీ (క్రైమ్స్) పి. శ్రీనివాసరావు పర్యవేక్షణలో కాశీబుగ్గ సబ్ డివిజనల్ అధికారి టి. భవాని సూచనల మేరకు, ఈ కేసును ఛేదించి నిందితులను పట్టుకోవడంలో క్రియాశీలంగా పనిచేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. సీఐ లు వై. రామకృష్ణ, ఎం. చిన్నన్నాయుడు, ఎస్ ఐ లు ,ఆర్. నరసింహమూర్తి, సునీల్, కే. మధుసూదనరావు,,రాజేష్ ,పి.పారి నాయుడు, సి.హెచ్ గంగరాజ, హెచ్‌సీలు గవరయ్య,పీసీలు ఉషాకిరణ్, ఎం. నీలకంఠం, మాధవ్, అలీ, శణ్ముఖరావు, భాసీర్, లోకనాథం, రాధాకృష్ణ, హరీష్. ఐ‌టి కోర్ సిబ్బంది హెచ్‌సీ యం. శ్రీధర్ కుమార్, పీసీలు డి.కె.జె భరత్ రెడ్డి. యస్. నరేష్,ఈ కేసు ఛేదనలో క్రియాశీలంగా వ్యవహరించారని, సమన్వయం, సాంకేతిక వినియోగం ప్రశంసనీయమని జిల్లా ఎస్పీ అన్నారు.

Leave a Reply