సమృద్ధిగా వర్షాలు కురవాలని చండీ హోమం..

కరీమాబాద్, ఆంధ్రప్రభ ; సమృద్ధిగా వర్షాలు కురవాలని శని జయంతిని పురస్కరించుకొని శివనగర్ శ్రీ శివ భక్త మార్కండేయ దేవాలయంలో చండీ హోమం నిర్వహించారు. శనివారం ఉదయం దేవాలయంలో చండీ హోమం నిర్వహించారు. అంతకుముందు శని జయంతి పురస్కరించుకొని శనీశ్వరుడికి తైలాభిషేకం, నిర్వహించారు ఉదయం నుండి భక్తులు దేవాలయానికి చేరుకొని శని పూజలో పాల్గొన్నారు. 13 సంవత్సరాల తర్వాత శని అమావాస్య జయంతి శనివారం రోజు రావడం అరుదు అని ఈ రోజును భక్తులు సద్వినియోగం చేసుకోవాలని పూజారులు అభిషేక్ శర్మ, కృష్ణ శర్మ కోరారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలో వడ్నాల మల్లయ్య, సదానందం, నరేందర్, పాశికంటి రవికుమార్ పాశికంటి రాజేశ్వరరావు, సురేందర్, మధు, కస్తూరి శ్రీనివాస్ భాస్కర్, శ్యామ్ భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply