చిలుపూరులో వైభవంగా సుదర్శన హోమం

చిలుపూర్, ఆంధ్రప్రభ: చిలుపూర్ మండల కేంద్రంలోని బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణ నక్షత్రం సందర్భంగా ఆదివారం సుదర్శన హోమం, మాస కళ్యాణం కార్యక్రమాలను అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాలు, పట్టణాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, ధర్మకర్త మండలి సభ్యులు పాల్గొన్నారు. ఆలయ ఈవో లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించబడింది. కార్యక్రమంలో కె. మోహన్, ముఖ్య అర్చకులు బ్రాహ్మణపల్లి రవీందర్ శర్మ, అర్చకులు సౌమిత్రి రంగాచార్యులు, కృష్ణమాచార్యులు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. భక్తులకు హైదరాబాద్కు చెందిన పేర్ని లక్ష్మణ్ రావు – ప్రభావతి దంపతులు అన్నప్రసాదం అందజేశారు.
