కనగర్తిలో రైతుల ఆందోళన

కనగర్తిలో రైతుల ఆందోళన

  • ధాన్యం కొనుగోలులో జాప్యంపై నిరసన
  • గన్నీ సంచులు, లారీల కొరతపై కన్నెర్ర

ఓదెల, ఆంధ్రప్రభ : ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓదెల మండలం కనగర్తి గ్రామంలో శనివారం సుల్తానాబాద్- జమ్మికుంట ప్రధాన రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. ఐకెపి కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని, గన్ని సంచులు సైతం కొరతగా ఉందని లారీలు రాకపోవడంతో పూర్తిగా కొనుగోలు జాప్యం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. గత కొన్ని రోజులుగా స్థానిక ఐకెపి కేంద్రంలో కొనుగోలు జరగా పోవడంతో అధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తూ దాదాపు అరగంట సేపు రాస్తారోకో చేయడంతో రహదారి ద్వారా వెళ్లే వాహనాలకు ప్రయాణికులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.

దీంతో పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ చేరుకొని రైతులకు నచ్చజెప్పి కొనుగోలు జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. లారీలు, గన్నీ సంచులు కొరత సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సజావుగా జరిగేలా చూస్తానని, రైతుల ఇబ్బందులు దూరం చేసేందుకు అధికార యంత్రంతో మాట్లాడుతానని మాట ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. రైతుల ఆందోళన రాస్తారోకోతో ర వాదారికి ఇరువైపులా ప్రయాణికులు ఎండలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Leave a Reply