25 మందికి ఎసైలుగా ప్రమోషన్

25 మందికి ఎసైలుగా ప్రమోషన్

  • పోలీసులకు పదోన్నతుల పండుగ
  • భద్రాది జోన్ పోలీసులకు అవకాశం
  • ఎన్నో ఏళ్ళ నిరీక్షణకు మోక్షం
  • ఉత్తర్వులు జారీ చేసిన ఇంచార్జి డిఐజి సన్ ప్రీత్ సింగ్

వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ ; ఎన్నో ఏళ్ళ నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. సుదీర్ఘకాలం పోలీస్ శాఖలో పని చేస్తూ పదోన్నతుల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని జోన్-4 భద్రాద్రి జోన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు ఎట్టకేలకు పదోన్నతులు లభించాయి. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రమోషన్ల ప్రక్రియకు ఎట్టకేలకు మోక్షం లభించింది. హెడ్ కానిస్టేబుళ్లు, అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్లుగా (ఏఎస్ఐ) పనిచేస్తున్న 25 మందికి సబ్-ఇన్స్ పెక్టర్లుగా (ఎసై-సివిల్) పదోన్నతులు కల్పిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్, భద్రాద్రి జోన్-4 ఇంచార్జి డీఐజీ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం 30 శాతం కోటా కింద తాత్కాలిక ప్రాతిపదికన ఈ ప్రమోషన్లు కేటాయించారు.వరంగల్, మహబూబాబాద్ జిల్లాలతో పాటు ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న వీరికి వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు తదితర ప్రాంతాల్లో పోస్టింగులు ఇచ్చారు. పదోన్నతులు పొందిన వారంతా ఉత్తర్వులు అందిన 15 రోజుల్లోగా కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని షరతు విధించారు.ఒకవేళ గడువు లోగా రిపోర్ట్ చేయకపోతే ప్రస్తుత ప్యానెల్ సంవత్సరానికి ఆ ప్రమోషన్ హక్కును పూర్తిగా కోల్పోతారని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ప్రమోషన్స్ ఖాళీల లభ్యత ఆధారంగా కేటాయించారు.

పదోన్నతులు పొందిన 25 మందిలో ఈ కింది అధికారులు ఉన్నారు.వరంగల్ పోలీస్ కమీషనరేట్లో ఉన్న కె.కళాధర్ రాజును వరంగల్ కమీషనరేట్ కు,వరంగల్ పోలీస్ కమీషనరేట్లో ఉన్న జి.రామ కృష్ణ చారిని వరంగల్ కమీషనరేట్ కు, వరంగల్ పోలీస్ కమీషనరేట్లో ఉన్న సుదర్శన్ ను మహబూబాబాద్ కు కేటాయించారు. వరంగల్ పోలీస్ కమీషనరేట్లో ఉన్న కె.సుధాకర్ ను వరంగల్ కమీషనరేట్ కు,షేక్ బషీరోద్దీన్ మహబూబాబాద్ కు, పి.తిరుపతిని వరంగల్ కమీషనరేట్ కు,కె.శ్యామ్ సుందర్ ను వరంగల్ కమీషనరేట్ కు,కె.లక్ష్మీ నారాయణ ను వరంగల్ కమీషనరేట్ కు, సయ్యద్ ఉబేద్ ఉల్లా ఖమ్మం కమీషనరేట్ కు , గువ్వ శంకర్ ను వరంగల్ కమీషనరేట్ కు, కె.రమేష్ ను వరంగల్ కమీషనరేట్ కు, కత్తి. రమేష్ ను ఖమ్మం కమీషనరేట్ కు, జి.శ్రీనివాస్ ను ఖమ్మం కమీషనరేట్ కు, టి.సధానందం ను ఖమ్మం కమీషనరేట్ కు, సయ్యద్ సిరాజ్ పాషా ను ఖమ్మం కమీషనరేట్ కు, కాసర్ల రాజయ్యను ఖమ్మం కమీషనరేట్ కు ,కె.రమేష్, కె. రాజమౌళి, ఎస్. ప్రభాకర్, డి.రమాదేవిలని భద్రాది కొత్తగూడెం జిల్లాకు కేటాయించారు. మహబూబాబాద్ లో ఉన్న పున్నం ప్రభాకర్ రెడ్డిని మహబూబాబాద్ కు, పి. చందర్ ను మహబూబాబాద్ నుండి ఖమ్మం కమీషనరేట్ లో పోస్టింగ్ ఇచ్చారు. ఇంటిలిజెన్స్ లో పని చేస్తున్న ఆర్.గోపాల్ రెడ్డి, ఎన్. కుమార స్వామి, డి.సుదర్శన్ లకు ఎసై లుగా ప్రమోషన్స్ కల్పించి ఇంటిలిజెన్స్ విభాగంకే కేటాయించారు. ఒకేసారి 25 మందికి ఎసై లుగా ప్రమోషన్స్ లభించడంతో వారి కుటుంబాల్లో ఆనందోత్సవాల వెల్లివిరుస్తున్నాయి.

Leave a Reply