ap | టెన్త్ ఫెయిల్ అయిన బాధతో బాలిక ఆత్మహత్య..

ap | టెన్త్ ఫెయిల్ అయిన బాధతో బాలిక ఆత్మహత్య..

మూడు మార్కుల తేడాతో విషాదాంతం

ap | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో పదో తరగతి ఫలితాలు ఓ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చాయి. పత్తికొండ మండలం కనకదిన్నె గ్రామానికి చెందిన అవంతి అనే విద్యార్థిని టెన్త్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం ప్రకారం, ఇటీవల వెలువడిన పదో తరగతి ఫలితాల్లో అవంతికి సైన్స్ విషయంలో మూడు మార్కులు తక్కువగా రావడంతో ఫెయిల్ అయినట్లు తెలిసింది.

ఫలితాలు తెలిసిన తరువాత తీవ్ర నిరాశకు లోనైన ఆమె ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. బాలిక మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరీక్షల్లో అపజయం సాధారణమేనని, ఒక్కసారి విఫలమైనంత మాత్రాన జీవితమే ముగిసిపోయిందని భావించవద్దని ఉపాధ్యాయులు, పెద్దలు సూచిస్తున్నారు. విద్యార్థులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని, మళ్లీ ప్రయత్నిస్తే విజయం సాధించవచ్చని సూచించారు.

Leave a Reply