మంత్రి వివేక్ పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు
మంత్రి వివేక్ పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు
చెన్నూర్ ఆంధ్రప్రభ : రాష్ట్ర మంత్రి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని కాంగ్రెస్ నాయకులు హేచ్చరించారు. ఇవ్వాళ బిఆర్ఎస్ నాయకులు స్థానిక గోదాంల వద్ద రైతుల వరి ధాన్యం రవాణాలో జాప్యం జరుగుతుందని బిఆర్ఎస్ నాయకులు చేసిన నిరసన కార్యక్రమం పూర్తి స్థాయిలో తప్పుడు ఆరోపణని కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు.
స్థానికంగా నాయకులు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ పాలనకన్నా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని అన్నారు. మంత్రి వివేక్ చెన్నూరు నియోజకవర్గ రైతులు పండించిన పంటను ఒక గింజ లేకుండా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చి జిల్లా ఉన్నత అధికారులకు ఆదేశించి రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వ చేస్తున్న కార్యక్రమాలు మింగుడు పడని బిఆర్ఎస్ నాయకులు నియోజక వర్గంలో ఉనికి లేకుండా పోతుందని మంత్రి వివేక్ పై ఎంపీ వంశీ బురదజల్లే ప్రయత్నాలు చేస్తూన్నారని ఆరోపించారు. ఒక హోదాలో ఉన్న ప్రజా ప్రతినిధులను చిల్లర మాటలతో సంబోదిస్తూ, చిల్లర రాజకీయం చేస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
