Aditya dhar | ప్లాన్ మామూలుగా లేదుగా..?

Aditya dhar | ప్లాన్ మామూలుగా లేదుగా..?

Aditya dhar | ఆదిత్య ధర్ సక్సెస్ స్టోరీ – ధురంధర్ నుంచి ధురంధర్ 2 వరకు
ధురంధర్ 2 తర్వాత నెక్ట్స్ ప్లాన్ ఏంటి..?
ముగ్గురు స్టార్ హీరోలతో భారీ మల్టీస్టారర్ ప్లాన్
మైథలాజీ – మోడరన్ వార్ కాన్సెప్ట్ అంటే ఏమిటి..?
‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ టైటిల్ పై ఆసక్తికర చర్చ
ఇండియన్ సినిమా హిస్టరీలో సంచలనం అవుతుందా..?

Aditya dhar | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ధురంధర్ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆక్షించాడు బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్. ఈ సినిమా సైలెంట్ గా వచ్చి ఒక్క హిందీలోనే 1300 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు ధురందర్ 2 పాన్ ఇండియా మూవీగా వచ్చింది. రిలీజ్ (Release) కి ముందు నుంచే బాక్సాఫీస్ ని షేక్ చేసింది. రిలీజ్ తర్వాత అంచనాలకు మించి ఉందనే టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఆదిత్య ధర్ పేరు మరోసారి మారుమ్రోగింది. ఇప్పుడు ఆదిత్య ధర్ నెక్ట్స్ ఏంటి అనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ.. ఆదిత్య ధర్ నెక్ట్స్ మూవీ ఎవరితో..?

Aditya dhar

Aditya dhar | ధురంధర్ 2కి ముందు ఆతర్వాత..

ధురంధర్, ధురంధర్ 2 సినిమాల గురించి ఎవర్ని అడిగినా.. స్పై చిత్రాల గురించి చెప్పాలంటే.. ధురంధ‌ర్ 2 కి ముందు త‌ర్వాత అని చెప్పచ్చు. భార‌తీయ సినిమా (Movie) చ‌రిత్ర‌లో ఓ గొప్ప చిత్రంగా ధురంధ‌ర్ 2 మిగిలిపోతుంది అంటున్నారు. ఇంతటి విజయాన్ని సాధించిన ఆదిత్య ధర్ నెక్ట్స్ మూవీ ఎవరితో చేస్తాడు..? ఏ జోనర్ లో మూవీ చేస్తాడు..? ఎప్పుడు ఈ మూవీ పట్టాలెక్కుంది..? ఇలా రకరకాల డిస్కషన్స్ సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. అయితే.. కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. నెక్ట్స్ మూవీ కోసం ముగ్గురు స్టార్ హీరోలతో చర్చలు జరిపినట్టుగా ప్రచారం జరుగుతుంది.

Aditya dhar

Aditya dhar | ఆదిత్య ధర్ మరో సంచలనం..

అయితే.. ఆ ముగ్గరు హీరోలు ఎవరు అనేది బయటకు రాలేదు కానీ.. బాలీవుడ్ నుంచి ఓ స్టార్, టాలీవుడ్ నుంచి ఓ స్టార్, కోలీవుడ్ నుంచి ఓ స్టార్ ను తీసుకుని పాన్ ఇండియా రేంజ్ లో ఈ భారీ మల్టీస్టారర్ ను ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. ఆ ముగ్గురు హీరోలతో ఓ యూనిక్ కాన్సెప్ట్ గురించి చర్చలు జరిపాడట. ఇది మైథలాజీ – మోడరన్ వార్ కలయికలో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ (Project) కన్ ఫర్మ్ అయితే.. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇదో సంచలనం అవుతుంది అనడంలో సందేహం లేదు. దీనికి ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ అనే టైటిల్ కూడా అనుకున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే.. ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ రావాల్సివుంది.

Aditya dhar

Leave a Reply