బీజేపీకి సపోర్టు చేసేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించలేదని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పని చేస్తున్నది చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికల కోసం తాము బీసీ కులగణన చేయలేదన్నారు.
చిత్తశుద్ధితో కులగణన చేయాలనే కార్యాచరణ తీసుకున్నాం. ఎన్నికలకోసమే చేయాలనే బీజేపీ, బీఆర్ఎస్ తత్వం తమది కాదన్నారు. ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాని. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు అందరికీ న్యాయం జరగాలనే కులగణన చేపట్టామన్నారు.