నంద్యాల బ్యూరో, ఫిబ్రవరి 10 : నంద్యాల జిల్లా బొమ్మలసత్రం నుంచి బొగ్గులైన్ నుంచి వెళ్లే రహదారిలో సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాంఘీక శాస్త్రం టీచర్ పి.నాన్సీ మేరీ 58 అక్కడికక్కడే మృతిచెందగా, భర్త యేసురత్నంకు తీవ్ర గాయాలయ్యాయని నంద్యాల మూడవ పట్టణ పోలీసులు తెలిపారు.
వారు తెలిపిన వివరాల మేరకు.. శిరివెళ్ల మండలం, యర్రగుంట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘీక శాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న పి.నాన్సీ మేరీ మోటార్ సైకిల్, కారు ప్రమాదంలో మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అయితే ఇటీవలే రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డు కూడా పొందినటువంటి టీచర్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం తీరని లోటని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. భర్త యేసురత్నంకు తీవ్రగాయాలు కావడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు.