ఆర్టీసీ సమస్యలపై బీఆర్‌ఎస్ విమర్శలు సిగ్గుచేటు: కొలిపాక సతీష్

స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : ఆర్టీసీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించిన కాంగ్రెస్ ప్రభు త్వంపై బీఆర్‌ఎస్ నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటని వరంగ ల్ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ కొలిపాక సతీష్ మండిపడ్డారు. శనివారం డివిజన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఆర్టీసీ సమస్యలను మూడు రోజుల్లోనే పరిష్కరించి, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వంలో విలీనం, సంఘాల ఎన్నికలు, 11 శాతం పీఆర్సీ వంటి కీలక నిర్ణయాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని పేర్కొ న్నారు.

ఎన్నో సంవత్సరాలుగా నెరవేరని కార్మికుల డిమాండ్లను అమ లు చేయడం జరిగినప్పటికీ, బీఆర్‌ఎస్ నాయకులు చిల్లర రాజకీ యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. గతంలో కే. చంద్రశేఖర్ రావు ప్రభుత్వం సమయంలో ఆర్టీసీ కార్మికులు దాదాపు 55 రోజుల పాటు సమ్మెలు చేపట్టినా సమస్యలు పరిష్కారం కాలేదని గుర్తుచేశారు. ఆ సమయంలో వేలాది కార్మికులపై కేసులు నమోదు చేయడం, ఉద్యోగ భద్రతపై అనిశ్చితి కలిగించడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని అన్నారు. పలువురు కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న విషాద ఘట నలను కూడా ఆయన ప్రస్తావించారు.

ఇప్పుడేమో అదే సమస్యలను పరిష్కరించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం బీఆర్‌ఎస్ నాయ కుల ద్వంద్వ వైఖరిని చూపుతోందని కొలిపాక సతీష్ వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కార్మికులకు న్యాయం జరిగిందని ఆయన అన్నా రు. ఈ కార్యక్రమంలో 18వ వార్డు కౌన్సిలర్ పొన్న రవి, సోషల్ మీడి యా ఇంచార్జ్ మామిడ్ల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ రమేష్, గట్టు కోటి, జంపాల శ్రీనివాస్, ఖలీమ్, గట్టు శివ, తాళ్లపల్లి కుమార్, గట్టు రంజిత్, ఏలీయా, వీరస్వామి, సందీప్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply