బోర్ మోటార్ ను ప్రారంభించిన సర్పంచ్ కావటి రజిత రవీందర్
గణపురం, ఆంధ్రప్రభ : మండలంలోని చెల్పూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోనీ 8వ వార్డులో నీటి సమస్య ఉందని వార్డు సభ్యులు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి బోర్ పాయింట్ వేసి శనివారం విద్యుత్ మోటార్ బిగించి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కావటి రజిత రవీందర్, గ్రామపంచాయతీ కార్యదర్శి ముక్కెర హేమంత్, వార్డు సభ్యులు అల్లూరి సారయ్య,తీగల శ్రీకాంత్,బోడ రాజేందర్, కారోబర్ వేణు ,పెరుక మనోహర్,దారకొండ శంకర్, నాగరాజు ,పొనగంటి సతీష్,అడప శ్రీను, పెద్దపల్లి తిరుపతి,తాటికంటి చంద్రు,కాలనీ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.
