డోర్-టు-డోర్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి: గద్దె అనురాధ
( పడమట, ఆంధ్రప్రభ ) : తూర్పు నియోజకవర్గంలో టి.డి.పి. డోర్-టు-డోర్ కార్యక్రమాన్ని మరింత వేగవంతంగా చేపట్టి, త్వరగా పూర్తి చేయాలని తెలుగుదేశం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ కన్వీనర్లందరినీ కోరారు. రికార్డు సమయంలో తన పరిధిలోని గృహాలను పూర్తి చేసిన 6వ డివిజన్ లోని 2వ బూత్ కన్వీనర్ ను ఆమె ఘనంగా సత్కరించారు.
శాలువా కప్పి, రూ.5వేల నగదు బహుమతి అందజేశారు. 6వ డివిజన్, 2వ బూత్ కన్వీనర్ కోండ్రు రాంబాబు తన పరిధిలోని డోర్-టు-డోర్ కార్యక్రమాన్ని రికార్డు టైములో పూర్తి చేసి వారికి కరపత్రాలను అందజేయడంపై తెలుగుదేశం ఎన్టీఆర్ అధ్యక్షురాలు గద్దె అనురాధ హర్షం వ్యక్తం చేశారు.
పార్టీ కేంద్ర కార్యాలయం, తూర్పు శాసనసభ్యులవారు విడుదల చేసిన కరపత్రాలను 2వ బూత్ కన్వీనర్ కోండ్రు రాంబాబు తన పరిధిలోని ప్రజలందరికీ అందజేశారని, 100 శాతం రికార్డు టైములో పూర్తి చేయడం సంతోషకరమని పేర్కొన్నారు. అతని పనితనాన్ని మెచ్చి గద్దె అనూరాధ శనివారంనాడు రాంబాబును శాలువాతో సత్కరించి, అతనికి రూ.5 వేల నగదు బహుమతి అందజేశారు.
నియోజకవర్గంలోని కన్వినర్లంతా రాంబాబును ఆదర్శంగా తీసుకొని తమ పరిధిలోని గృహాలన్నింటినీ త్వరితగతిగా పూర్తి చేయాలని, కరపత్రాలన్నింటినీ పంపిణీ చేయాలని, ప్రజలకు కూటమి విజయాలను వివరించాలని గద్దె అనురాధ కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లై విజిలెన్స్ నెంబర్ గుమ్మడి గురు ప్రసాద్ గారు పడాల వాసు, కిలాని మణికంఠ తదితరులు పాల్గొన్నారు.
