శాంతిఖని, బొగ్గుగనిని మూసివేసేది లేదు..

శాంతిఖని, బొగ్గుగనిని మూసివేసేది లేదు..
ప్రైవేట్ వారు ముందుకు వస్తే వారితోనే గని నడిపిస్తాం
ఎవరు రాకున్నా ఎస్ డీ ఎల్స్‌తో గనిని నడిపిస్తాం
సింగరేణి సంస్థ ప్రాజెక్ట్ ప్లానింగ్ డైరెక్టర్ కె వెంకటేశ్వర్లు
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణం లోని శాంతిఖని బొగ్గు గనిలో అపార బొగ్గు నిక్షేపాలున్నందున ఎలాగైనాబొగ్గును వెలికి తీసేందుకు సింగరేణి సంస్థ తగు ప్రణాలికల తో ముందుకు వెళ్తుందని సింగరేణి సంస్థ ప్రాజెక్టు ప్లానింగ్ డైరెక్టర్ కొప్పుల వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఆధు నీ కరించిన ఓపి బ్లాకులను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన డివై సీఎన్ఓ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు.
శాంతి కళ్ళు జే ఎం ఎస్ కంపెనీ ఆధ్వర్యంలో బొగ్గు ఉత్పత్తి పనులను చేపట్టగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ సంస్థ l06 కోట్ల రూపాయల విలువ గల బోల్టర్ మైనర్ యంత్రాన్ని గనిలోనే వదిలేసి వెళ్లిపోయిందన్నారు. నెలకు 500మీటర్లబొగ్గు కటింగ్ చేయాల్సిన జే ఎం ఎస్ సంస్థ కేవలం 200 మీటర్ల బొగ్గు కటింగ్ చేయడంతో ఈ గనిలో బొగ్గు ఉత్పత్తి నష్టంజరిగిందన్నారు. జే ఎం ఎస్ సంస్థ సరైన బొగ్గు కటింగ్ చేయక పోవడం తో పెనాలిటీ వేశామన్నారు. సాలర్ జింగ్ సీంలో బొగ్గుఉత్పత్తికి అవకాశాలు ఉన్నాయని బొగ్గు కటింగ్ కు ఎవరైనా ప్రయివేట్ సంస్థ ముందుకు వస్తే వారికీ బొగ్గు కటింగ్ అప్ప గిస్తామన్నారు.
ఎవరు రాకుంటే సింగరేణి సంస్థనే 8 ఎస్ డీ ఎల్స్ తెచ్చి ఉత్పత్తి తీసుకువచ్చి ఈ బొగ్గు గనినికాపాడతామన్నారు. గని మూసివేస్థారనే ఉదంతాలను సింగరేణి కార్మికులు, ప్రజలునమ్మవద్దన్నారు. బెల్లంపల్లి ఏరియాలో త్వరలో గోలేటి ఓపెన్ కాస్ట్ గని ప్రారంభించేందుకు సింగరేణి సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు డైరెక్టర్ తెలిపారు. ఈ కొత్త ప్రాజెక్టు వస్తే బెల్లంపల్లి ఏరియాకు పూర్వ వైభవంవస్తుందన్నారు. కైరిగూడ ఓపెన్ కాస్ట్ ఉన్న బెల్లంపల్లి ఏరియాలో సింగరేణి సంస్థ నిర్దేశించిన బొగ్గుఉత్పత్తి లక్ష్యాన్ని ఆధిగమించిన ఏరియాల్లో నేడు బెల్లంపల్లి సత్తుపల్లి రెండేఏరియలనారు.
గతంలో బెల్లంపల్లి ఏరియాలో రోజుకు 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగేదని కానీ నేడు ఒకే ఒక్క ఖైరి కూడా ఓపెన్ కాస్తున్న బెల్లంపల్లిలో నాలుగు రేకుల బొగ్గును సరఫరా చేసి సింగరేణి సంస్థలోబెల్లంపల్లి ఏరియా గొప్పరికార్డుసృష్టించిందన్నారు. ఆయన వెంట బెల్లంపల్లి ఏరియా జిఎం విజయ భాస్కర్ రెడ్డి, ఏరియా ఆస్పత్రి డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ పాండురంగ చారి, బెల్లంపల్లి రీజియన్ క్వాలిటీ జీ ఎం వీరభద్రం, తదితరులు పాల్గొన్నారు.
