Brs l మోయిజ్ హుస్సేన్ గెలుపు 12వ వార్డు అభివృద్ధికి మలుపు…

Brs l మోయిజ్ హుస్సేన్ గెలుపు 12వ వార్డు అభివృద్ధికి మలుపు…

Brs l మక్తల్ , ఆంధ్రప్రభ; మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో 12వ వార్డు నుండి బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మోయిజ్ హుస్సేన్ గెలుపు వార్డు అభివృద్ధికి మలుపని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు అన్వర్ హుస్సేన్ అన్నారు .ఎన్నికల ప్రచారం చివరి రోజు అయిన సోమవారం రోజు అభ్యర్థి మోయిజ్ హుస్సేన్ తో కలిసి ఆయన వార్డుల్లో విస్తృతంగా పర్యటించి ఇంటింటా ఓటర్లను కలుసుకొని మద్దతు ఇవ్వాలని కోరారు. వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తమకు అవకాశం ఇవ్వాలని కోరారు .12వ వార్డు అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తారని ఆయనను ఆదరించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్ల అభివృద్ధి సాధ్యం కాదని అన్నారు.

రొండేళ్ళలో ఎలాంటి అభివృద్ధి చెయని కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ ఎన్నికలలో గెలిస్తే ఏ విధంగా అభివృద్ధి చేస్తారో ఒకసారి ఆలోచించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు .ప్రజా సమస్యల పరిష్కారం అభివృద్ధి తమ ధ్యేయమని అన్నారు .గతంలో 12వ వార్డు పరిధిలో ఎంతో అభివృద్ధి చేశామని మిగిలిన అభివృద్ధిని పూర్తిచేసేందుకు ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మోయిజ్ హుస్సేన్ కు అవకాశం కల్పించాలన్నారు .అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో పారదర్శకంగా పనిచేయడమే తమ లక్ష్యమని అన్నారు. ఈ నెల 11న జరగనున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా 12 వ వార్డు నుండి పోటీ చేస్తున్న మోయిజ్ హుస్సేన్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని అన్వర్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.