రేపు మ‌హాధ‌ర్నా

తపస్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ

బొంరాస్ పేట్, ఆంధ్రప్రభ : తపస్ (తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS) ) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఉపాధ్యాయులు,ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం బోంరాస్ పేట్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆగస్టు1 న చేపట్టే మహా ధర్నా పోస్టర్ ను శుక్రవారం సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా తపస్ జిల్లా గౌరవ అధ్యక్షులు బాకారం మల్లయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.పెండింగ్ పీఆర్సీ నివేదికను వెంటనే విడుదల చేసి 51 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాలన్నారు.పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను వెంటనే ప్రకటించి పెన్షనర్స్ తో సహా అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని అన్నారు.

CPSను రద్దు చేసి,అందరికీ పాత పెన్షన్ విధానం (OPS) అమలు చేసి 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు OPS అమలు చేసి,సుప్రీంకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన SLPను ఉపసంహరించుకోవాలని కోరారు.వీటితో పాటు పలు డిమాడ్ల పరిష్కారం కోసం ఆగస్టు 1న ఇందిరాపార్కు వద్ద ధర్నాలో సంఘాలకు అతీతంగా ఉపాధ్యాయులుపెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో తపస్ మండల అధ్యక్షులు బాకారం చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి,మహేష్, ఆదర్శ్ , ప్రశాంత్ కుమార్,ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.