electric shock | విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

electric shock | విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి
electric shock | గాంధారి, ఆంధ్రప్రభ : మేకల మేత కోసం చెట్టుపైకి ఎక్కి, కొమ్మలు నరుకుతుండగా, విద్యుత్ షాక్ తగలడంతో ఒకరు మృతి చెందిన సంఘటన గాంధారి మండలంలోని వండ్రికల్ గ్రామంలో చోటుచేసుకుంది. గాంధారి ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం, మండలంలోని వండ్రికల్ గ్రామానికి చెందిన వేముల కిషన్ రావు (25) ప్రతిరోజు మాదిరిగానే మేకలను మేపడానికి కోసం, సోమవారం గ్రామ శివారులోని మత్తడి ఒర్రె వద్దకు వెళ్లినట్లు తెలిపారు.
ఒర్రె ఒడ్డున గల మేడి చెట్టు పైకి ఎక్కి, కత్తితో కొమ్మలను నరుకుతుండగా, చెట్టుపై నుంచి వెళ్లిన 11కేవీ విద్యుత్ వైర్లను గమనించకపోవడంతో, అవి కిషన్ రావు, తలకు తగలడంతో ఆయన అక్కడికక్కడే, చెట్టు పైనే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్యతో పాటు, 21 రోజుల వయస్సు గల కుమారుడు ఉన్నాడని, మృతుడి తండ్రి శ్యామ్ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

