AP | అమెరికాలో నరసరావుపేట యువకుడి సాహసం..

14 వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్


AP | పల్నాడు, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం లింగం గుంట్ల గ్రామానికి చెందిన భవనం అశోక్ రెడ్డి అమెరికాలో స్కైడైవింగ్ చేసి సాహసాన్ని చాటుకున్నారు. సుమారు 14 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం నుంచి దూకిన అశోక్ అనంతరం పారాచూట్‌ను విజయవంతంగా తెరిచి సురక్షితంగా నేలపైకి చేరుకున్నారు.

స్కైడ్రైవింగ్ విజయవంతంగా పూర్తి చేసిన నరసరావుపేట యువకుడు అశోక్ రెడ్డి భవనంపై కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. విదేశాల్లో చదువుతో పాటు సాహస క్రీడల్లోనూ తన ప్రతిభను చాటుకోవడం పల్నాడుకే గ్రామానికి గర్వకారణమని కొనియాడారు.