నాటి విద్యార్థులు నేడు సమాజానికి స్ఫూర్తినిస్తున్నారు..

నాటి విద్యార్థులు నేడు సమాజానికి స్ఫూర్తినిస్తున్నారు..

వనపర్తి , ఆంధ్రప్రభ : స్థానిక రాణి లక్ష్మీదేవి అమ్మ డిగ్రీ కాలేజ్ 1980-83 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఎస్ఎల్వి గార్డెన్‌లో ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆనాటి అధ్యాపకులు బిఎల్ఎన్ మూర్తి మాట్లాడుతూ నాటి మా విద్యార్థులు నేడు సమాజంలో స్ఫూర్తినియ్యడం సంతోషకరమని అన్నారు. అధ్యాపకులు సిద్ధిరామిరెడ్డి, శివరామకృష్ణ, అనంతరెడ్డి, దశరథ రాములు, కృష్ణయ్య తదితరులు హాజరై పూర్వ విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించారు.

ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ, నాడు తాము విద్యార్థులకు పాఠాలు బోధించగా, నేడు వారు సమాజంలో ఉన్నత స్థానాల్లో నిలిచి తమకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. గురు-శిష్య సంబంధం కాలానుగుణంగా మరింత బలపడిందని తెలిపారు. నాటి కాలంలో ఉన్న సరళ జీవన విధానం, పరస్పర గౌరవం, విలువలు నేటి ఆధునిక జీవన శైలి మధ్య ఉన్న తేడాలను వివరిస్తూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
పూర్వ విద్యార్థులు తమ కాలేజ్ రోజుల జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సమ్మేళనం పాత స్నేహాలను మరింత బలపరిచే వేదికగా నిలిచింది. కార్యక్రమం ఆనందభరిత వాతావరణంలో సాగింది.