BRS | మంత్రి వివేక్ వెంకటస్వామి భారీ షాక్…
BRS | మంత్రి వివేక్ వెంకటస్వామి భారీ షాక్…
BRS | మంచిర్యాల జిల్లా, ఆంధ్రప్రభ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జడ్పీ మాజీ వైస్ ఛైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చెన్నూర్ మండలానికి చెందిన మూల రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈరోజు చెన్నూరు నియోజకవర్గం నుండి సుమారు 250 కార్ల భారీ కాన్వాయ్ తో కారు పార్టీలో మూల రాజిరెడ్డి చేరనున్నారు. సుమారు వెయ్యి మంది అనుచరగణంతో ఈరోజు హైదరాబాద్ లోని తెలంగాణా భవన్ లో బీ ఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలు, పార్టీ విధానాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రి వివేక్ వెంకటస్వామి గెలుపు కోసం కృషి చేశానన్నారు. 2 ఏళ్లుగా ఒక్క హామీ అమలు కాలేదనే అసంతృప్తితో రాజీనామా చేసి బీ ఆర్ ఎస్ లో చేరుతున్నట్లు ఆయన వెల్లడించారు.
