అటవీ భూములను సందర్శించిన బిఎస్సీ ఫారెస్ట్ విద్యార్థులు..
జన్నారం, ఆంధ్రప్రభ : కవ్వాల టైగర్ రిజర్వ్ లోని జన్నారం అటవీ డివిజనల్ ఇందనపల్లి ఫారెస్ట్ రేంజ్ లోని అడవులను,అటవీ భూములను ములుగు ఫారెస్ట్ కళాశాల (ఎఫ్సీఆర్ఐ) బీఎస్సీ మూడో సంవత్సరం విద్యార్థులు మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఇందన పల్లి రేంజ్లోని కలమడుగు ఫారెస్ట్ బీట్ కంపార్ట్మెంట్ నంబరు 333లో ఇటీవల స్వాధీనం చేసుకున్న అటవీ భూమిని సందర్శించి,అటవీ భూమి పునరుద్ధరణ,పరిరక్షణ చర్యలను ఆ విద్యార్థులు పరిశీలించారు.

ఆ తర్వాత నాయకగూడలోని వెదురు వర్క్షాప్ను సందర్శించి,వెదురు ప్రాసెసింగ్ విధానాలు, సుస్థిర అటవీ నిర్వహణలో ప్రాముఖ్యత గురించి విద్యార్థులు అవగాహన పొందారు.అనంతరం బర్తన్పేట ఫారెస్ట్ సెక్షన్ లోని కామనపల్లి,నర్లాపూర్ సౌత్ బీట్లలో ఆ విద్యార్థుల బృందం ట్రెక్కింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గోదారి లక్ష్మీనారాయణ,ఫారెస్ట్ సెక్షన్,బీట్ ఆఫీసర్లు శేషారాం,హన్మంతరావు,రాజేశ్వర్, పోచయ్య,హిట్ కాస్ ప్రతినిధి వెంకట్,టెక్నికల్ అసిస్టెంట్ మహేష్, తదితరులు పాల్గొన్నారు.
