పత్తి పంటలో అంతర పంటతో అధిక లాభాలు..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : రైతులు వర్షాకాలం సాగు చేసే పత్తి పంటలో అంతర పంటలు వేయడం వల్ల తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధించవచ్చని ఊట్కూర్ మండల వ్యవసాయ శాఖ అధికారిగణేష్ రెడ్డిసూచించారు. సోమవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలపరిధిలోని అమీన్ పూర్ రైతు వేదిక భవనంలో పత్తిపంటలో అంతర పంట సాగుపై రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ పత్తిలో అంతర పంటలు తప్పనిసరిగా వేయాలని ప్రతి మూడు నాలుగు వరుసలకు ఒక వరుస కంది, ఆముదం, ఇతర పంటలతో అంతర పంటలు వేయాలని సూచించారు.

గత ఆరు ఏడు సంవత్సరాల గా మండలంలో సుమారు 40 వేల ఎకరాలకు పైగా పత్తి సాగు చేయడం చేయడం జరుగుతుందనిదీనివల్ల చిడిపిడలు పురుగుల ఉధృతి పెరిగి రైతులు నష్టపోతున్నారని అన్నారు. పత్తి పంటకు వివిధ తెగుళ్లు సోకడంవల్ల రైతులు నష్టపోతున్నారనిఅన్నారు. ప్రతి రైతు విధిగా పంట మార్పిడి విధానం అలవర్చుకోవాలన్నారు. వరి పంట వ్యర్ధాలు కాల్చడం వలన కలిగే దుష్పరిమాణాలు నకిలీ పత్తి విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వర్షాకాలంలో పుష్కలంగా వర్షాలు కురిసిన తర్వాత రైతులు పంటలు సాగు చేయాలనిఅన్నారు. తేలికపాటి వర్షాలకు పంటలు సాగు చేయడం వల్ల రైతులు నష్టపోతారని అన్నారు. ప్రతి రైతు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు సూచనల మేరకు పంటలు సాగు చేసి మందులు వాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ టప్ప నాగేష్, ఏఈఓ రజిత, స్వచ్ఛ దర్శనం ఫౌండేషన్ నిర్వాహకులు సత్యనారాయణ, ప్రకృతి రైతు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply