కనకదుర్గమ్మకు బోనం సమర్పించిన బండ్రు శోభారాణి
ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో 11వ వార్షికోత్సవం, దుర్గమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ, మాజీ ఎంపీటీసీ జూకంటి ప్రణతి, ఆలేరు పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పాము అనిత తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
