కాంగ్రెస్ పార్టీ కడెం మండల అధ్యక్షులుగా బొడ్డు గంగన్న
కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బొజ్జు పటేల్ ప్రతిపాదనల మేరకు ఖానాపూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నూతన మండల, పట్టణ అధ్యక్షులను నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీ మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కడెం మండల అధ్యక్షుడిగా నచ్చన్ ఎల్లాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ బొడ్డు గంగన్నను, కడెం టౌన్ అధ్యక్షుడిగా కడెంకు చెందిన ఎండి వాజిద్ ఖాన్‌ను నియమించారు. తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బొజ్జు పటేల్‌కు బొడ్డు గంగన్న, ఎండి వాజిద్ ఖాన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతం, కార్యకర్తల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు శ్రమిస్తామని బొడ్డు గంగన్న పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
