కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రయోజనకరం..

ఆలేరు, ఆంధ్రప్రభ : కేంద్రంలోని నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ బిజెపి అధ్యక్షులు నందగంగేష్ ఆదివారం చెప్పారు. ప్రజల సమగ్ర స్థితిగతులు పరిపూర్ణంగా అధ్యయనం చేసిన అనంతరం రూపొందించి అమలు పరుస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా తోడ్పడుతున్నాయని తెలిపారు. తెలంగాణలో బిజెపి వేగంగా విస్తరిస్తున్నదని అన్నారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బిఆర్ఎస్ లతో విసిగి వేసారిన తెలంగాణ ప్రజలు ఈసారి తప్పక బిజెపి వైపే నిలబడతారని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి కార్యకర్త ప్రజల వద్దకు తీసుకువెళ్లి ఇంటింటి ప్రచారం చేయాలని ఆయన కోరారు.
