కడెం విజయ డెయిరీని సందర్శించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు

కడెం, ఆంధ్రప్రభ: మండల కేంద్రంలోని విజయ డెయిరీని ఆదివారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా డెయిరీలో రోజువారీ పాల సేకరణ, పాల కలెక్షన్ కేంద్రాల సంఖ్య, ఏయే మండలాల నుంచి పాలు వస్తున్నాయనే వివరాలను డెయిరీ మేనేజర్ ఎస్. వెంకటస్వామిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం డెయిరీ మేనేజర్ ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో డెయిరీ మేనేజర్ ఎస్. వెంకటస్వామి, సిబ్బంది, నిర్మల్ డీసీసీ ప్రధాన కార్యదర్శి పి. సతీష్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.