తై బజార్ సంతకు రూ.10.80 లక్షల వేలం

జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో ప్రతి గురువారం నిర్వహించే తై బజార్ సంతను శనివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో వేలం వేసినట్లు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్, ఇన్‌చార్జి ఈఓ ఆనందరావు తెలిపారు.

2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కూరగాయల తై బజార్ సంత వేలంపాటలో పలువురు వేలందారులు పోటాపోటీగా పాల్గొన్నారు. ఇందులో గేడం లక్ష్మణ్ అత్యధికంగా రూ.10 లక్షల 80 వేలుకు సంతను దక్కించుకున్నారు.

ఈ వేలంపాట కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అబ్దుల్ ముఖిద్, కాంగ్రెస్ నాయకుడు దండుగుల మహేష్ కుమార్, పంచాయతీ సిబ్బంది, వేలందారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply