11 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులకు అనుమతి

11 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులకు అనుమతి

తొర్రూరు, ఆంధ్రప్రభ:
మండలంలోని 11 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందని ఎంఈఓ మహంకాళి బుచ్చయ్య తెలిపారు.

బుధవారం డివిజన్ కేంద్రంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించేందుకు విద్యాశాఖ కమిషనర్ అనుమతి ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

మండలంలోని తొర్రూరు అంబేద్కర్ కాలనీ, గుర్తూరు, కంటాయపాలెం, మడిపల్లి, మాటేడు, చర్లపాలెం, చీకటయపాలెం, హరిపిరాల, నాంచారిమడూరు జయంతి కాలనీ, సోమారం ప్రాథమిక పాఠశాలలకు అనుమతి లభించిందని తెలిపారు. అలాగే అమ్మాపురం, వెలికట్ట, వెంకటాపురం ప్రాథమిక పాఠశాలలకు 2025–26 విద్యా సంవత్సరంలో అనుమతి లభించినట్లు గుర్తు చేశారు.

మూడేళ్ల వయసు ఉన్న పిల్లలందరినీ ప్రీ ప్రైమరీ పాఠశాలలకు పంపించి నాణ్యమైన విద్యను పొందేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఆయన కోరారు.

Leave a Reply