మహిళ ఆత్మహత్యాయత్నం
మహిళ ఆత్మహత్యాయత్నం
మచిలీపట్నం – ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్లో “మీకోసం” కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. కలెక్టర్ ఎదుట అద్దంకి సంద్యారాణి (30) పురుగులు మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసుకోబోయింది. వెంటనే స్పందించి పురుగుల మందు డబ్బాను పోలీసులు లాక్కుని బయటకు తీసుకొచ్చారు. తన అక్క సుదగాని సుదారాణి మరణంపై అనుమానాలు ఉన్నాయని సంధ్యారాణి ఫిర్యాదు చేయగా, అక్క మరణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించింది.
పెద్ద మనుషులు డబ్బులు తీసుకుని కేసును తప్పుదారి పట్టించారన్న తెలిపింది. పలుమార్లు అర్జీలు పెట్టినా పట్టించుకోలేదని, మృతురాలికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని తెలిపింది. అక్క మరణంపై మళ్లీ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేసింది. ఆమెను పోలీసు స్టేషన్ కు తరలించారు.
