కూలిన బ్రిడ్జి వద్ద సీపీఐ నేతల పరిశీలన..
టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో సిపిఐ ఎమ్మెల్ పార్టీ ఆధ్వర్యంలో గతంలో కూల్పోయిన బ్రిడ్జి నీ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారుల తీరుపై విమర్శలు గుప్పించారు. బ్రిడ్జి కింద గతంలో కూలిపోయిన నిర్మాణ భాగాలను జెసిబి సహాయంతో తొలగిస్తుండటంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ పనులు ఎందుకు చేపడుతున్నారో.. ప్రభుత్వ అభివృద్ధి కోసమా.. వ్యక్తుల కోసమా.. అనేది ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
