Illegal | ఉప్పల్‌లో గంజాయి గుట్టురట్టు…

Illegal | ఉప్పల్‌లో గంజాయి గుట్టురట్టు…
ఇద్దరు అరెస్ట్, ఒకరు పరార్
Illegal | ఉప్పల్, ఆంధ్రప్రభ : నగరంలోని ఉప్పల్ ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణాపై ఎస్‌టిఎఫ్ పోలీసులు దాడులు నిర్వహించి రెండు వేర్వేరు కేసుల్లో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనల్లో ఇద్దరిని అరెస్ట్ చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

మొదటి ఘటనలో, ఉప్పల్ పరిధిలోని కేఎస్ఆర్ నగర్, రామంతపూర్ ప్రాంతంలో గంజాయి విక్రయాలు చేస్తున్న సర్వర్ అనే వ్యక్తిని ఎస్‌టిఎఫ్ బి టీం ఎస్సై బాలరాజు ఆధ్వర్యంలో అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు 220 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఉప్పల్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.

ఇక రెండో కేసులో, ఎస్‌టిఎఫ్ సి టీం ఎస్సై మంజు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి, మరో 220 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో వడ్డెర చందు అనే వ్యక్తిని అరెస్ట్ చేయగా, నితూ బాయ్ అనే నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
అరెస్ట్ చేసిన నిందితులను మరియు స్వాధీనం చేసుకున్న గంజాయిని శేర్లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించినట్లు ఎస్సై మంజు వెల్లడించారు. నగరంలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇలాంటి దాడులు కొనసాగిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
