విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి…

  • జిల్లా నూతన ఎస్పీ నితికా పంత్

జైనూర్, (ఆంధ్రప్రభ) : శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందికి సూచించినట్లు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నూతన ఎస్పీ నీతికా పంత్ తెలిపారు. ఆమె ఆదివారం రాత్రి జైనూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, రికార్డుల నమోదు, పెండింగ్ కేసుల పురోగతి, హాజరు రిజిస్టర్, స్టేషన్ శుభ్రత తదితర అంశాలను ఎస్పీ పరిశీలించారు. అనంతరం ఎస్‌హెచ్‌ఓ రవికుమార్, స్టేషన్ సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు.

గ్రామాల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అసాంఘికచర్యలు, అక్రమ రవాణా, మాదకద్రవ్యాలపై కఠినంగా నిఘా పెట్టాలని ఆమె ఆదేశించారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.

మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన కేసుల్లో ప్రత్యేక శ్రద్ధ చూపాలని, లా అండ్ ఆర్డర్ విషయంలో రాత్రిపూట పర్యవేక్షణ, పికెటింగ్, ప్యాట్రోలింగ్ కచ్చితంగా కొనసాగించాలని ఎస్పీ ఆదేశించారు. ప్రజాభద్రతకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్, జైనూర్ సీఐ రమేష్, ఎస్సై రవికుమార్ తదితర పోలీసులు పాల్గొన్నారు.

Leave a Reply