పేకాట రాయుళ్ల అరెస్ట్…

తాడ్వాయి, ఆంధ్రప్రభ : కరేడ్పల్లి గ్రామ ఫారెస్ట్ ప్రాంతంలో పేకాట నిర్వహిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. పేకాట జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని దాడి నిర్వహించారు.

ఈ రైడ్‌లో పేకాట ఆడుతున్న గాండ్ల గంగారం (కరేడ్పల్లి), భుజంగా రావు (సంగోజి వాడ), చేలిక శివాజీ రావు (సంగోజి వాడ), చిల్వన్ శంకర్రావు (ధర్మారావుపేట్), చంద్రశేఖర్ (సంగోజి వాడ)లను పట్టుకున్నారు.

వారి వద్ద నుండి మొత్తం రూ.11,030 నగదు, మూడు మోటార్‌సైకిళ్లు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.