TG | అసౌకర్యాల మధ్య మంచిర్యాల కార్పొరేషన్ ఎన్నికలు

TG | అసౌకర్యాల మధ్య మంచిర్యాల కార్పొరేషన్ ఎన్నికలు
విఫలమైన ఎన్నికల బల్దియా అధికారులు
TG | మంచిర్యాల, ఆంధ్రప్రభ : ప్రతిష్టాత్మకమైన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వాడి వేడి నువ్వా నేనా అన్న చందంగా మారింది. బుధవారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 21వ డివిజన్ 87వ పోలింగ్ బూత్ వద్ద బల్దియ అధికారులు సీనియర్ సిటిజన్స్ అయినటువంటి వృద్ధులకు, అంగ వైకల్యం కలిగిన వారికి వీల్ చైర్ సౌకర్యం కల్పించడంలో విఫలమయ్యారు. కార్మిల్ పాఠశాల ఆవరణంలో 20 21వ రెండు డివిజన్ల ఎన్నికలను నిర్మించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాట్లను చేసినప్పటికీ 7 వెల మంది ఓటర్స్ ఉన్నటువంటి ఈ కేంద్రంలో ఒకే వీల్ చైర్ ఉండడం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్స్ కి శాపంగా మారింది. 21వ డివిజన్ ఎన్ రామస్వామి అనే వృద్ధుడు వీల్ చైర్ లేకపోవడంతో పాఠశాల ప్రధాన గెట్ నుండి సుమారు మధ్యాహ్నం12 గంటల సమయంలో వాకర్ సహాయంతో ఓటు వేసేందుకు ముందుకు వచ్చినప్పటికీ సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించడంతో కొద్ది దూరం నడిచి ఎండలో ఆగిపోయాడు వెంటనే సమీపంలో ఉన్నవారు సహకరించి ఓటు వేసేందుకు తీసుకువెళ్లారు. ఎన్నికల పేరిట రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులను ఖర్చు చేస్తున్నట్లు చూపిస్తున్నారు కానీ ఇటు అధికారులు అటు ప్రజా ప్రతినిధులుగా ఉన్న అభ్యర్థులు సౌకర్యాలు కల్పించడంలో విఫలమైనట్టు స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
