Hospital | సమస్యల వలయంలో బాల్కొండ ఆసుపత్రి
- వైద్యులు ఉండరు..మందులు రావు
- ప్రసవాలు చేసే వైద్యులే లేరు
- బోసిపోతున్న ఐసీయూ వార్డు
- ఊడుతున్న బిల్డింగ్ పెచ్చులు
బాల్కొండ, ఆంధ్రప్రభ : నేను రాను బిడ్డో… మన ఊరు దవాఖానకు అంటూ ఆనాటి ప్రభుత్వ వైద్య విధానం, వైఫల్యాలను కళ్ళకు కట్టినట్టు చూపిన “నేటి భారతం” సినిమా పరిస్థితులు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి సరిగ్గా సూట్ అవుతోంది.
ఓ వెలుగు వెలిగిన ఆసుపత్రి ప్రస్తుతం సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. కొండంత ఉన్న అండ ఇప్పుడు కనిపించడం లేదని మండల ప్రజలు వాపోతున్నారు. రాష్ట్రంలోసాధారణ ప్రసవాల జాబితాలో రికార్డు ఉన్న ఆసుపత్రి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వైద్య విధాన పరిషత్ లో విలీనమైనా మెరుగైన వైద్యం అందడం లేదు.
పర్మినెంట్ గైనకాలజీ లేకపోవడంతో ప్రసవాలు నిలిచిపోయారు. నిత్యం పదుల సంఖ్యలో వచ్చే రోగులకు ఒకరిద్దరు వైద్యులతో వైద్యం అందిస్తున్నారు.కావాల్సిన మందుల సరఫరా లేదు. స్థానికంగా డాక్టర్లు లేక సరైన వైద్యం అందడం లేదు. పూర్తి స్థాయిలో స్టాఫ్ లేకపోవడంతో రోగులకు తిప్పలు తప్పడంలేదు.అనుకోని ప్రమాదాలు జరిగి ఆసుపత్రికి వచ్చినా వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.ఉమ్మడి మండలానికి ఒకే 108 అంబులెన్స్ ఉండడంతో సకాలంలో చేరుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు.

బోసిపోతున్న ఐసీయూ వార్డు
మాజీమంత్రి,బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కృషితో ఏర్పాటు చేసిన ఐసీయూ వార్డు కనీస సౌకర్యాలు లేక బోసిపోతోంది. కార్పొరేట్ కు ధీటుగా వైద్యం అందాలన్న లక్ష్యం నీరుగారుతోంది.అందుకు విద్యుత్ సరఫరా మరో సమస్యగా ఉంది.మంత్రిహోదాలో నియోజకవర్గంలో ఆసుపత్రుల ఆధునీకరణకు రూ.కోట్లు వెచ్చించి బాగుచేసినా సరైన స్టాఫ్ లేక డిప్యుటేషన్ లతో నెట్టుకస్తున్నారు.
శిథిలావస్థకు చేరుకున్న ఆసుపత్రి
నిత్యం పదుల సంఖ్యలో వచ్చే రోగులకు వైద్యం అందించే ఆసుపత్రి శిథిలావస్థకు చేరింది. వర్షం కురిస్తే స్లాబ్ పై నీరు చేరి గోడలు తడుస్తున్నాయి.ఆపరేషన్ థియేటర్ లో స్లాబ్ సీలింగ్ నుంచి పెచ్చులు ఊడి పడుతున్నాయి.శిథిలావస్థకు చేరిన స్లాబ్ తో గోడలు తడిసి కరెంట్ వైర్లు తేలి ఎర్తింగ్ వస్తోంది.కరెంట్, తాగునీరు,మరుగు దొడ్ల సమస్య పరిష్కరించాల్సిన అవసరం ఉంది.ఆసుపత్రికి వచ్చే వారికి కోతులు, కుక్కల బెడద తీవ్రంగా ఉంది.వాటి దాడిలో గాయపడిన సంఘటనలు బాగానే ఉన్నాయి.
ప్రసావాలు చేసే వైద్యులే లేరు
బాల్కొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు నిలిచిపోయాయి. గత కొన్నాళ్లుగా పూర్తిస్థాయిలో వైద్య సిబ్బంది లేకున్నా గైనకాలజిస్ట్ ఉండటంతో ప్రతి మంగళ, శుక్రవారల్లో రెండు రోజులు ఆపరేషన్లు చేసి కాన్పులు చేశారు. ప్రస్తుతం ఆ గైనకాలజిస్టు సైతం బదిలీపై వెళ్లడంతో కాన్పులు నిలిచి పోయాయి. మరో వైద్యురాలు జనరల్ సర్జన్ బదిలీపై వచ్చారు.
కానీ ఇక్కడ మూడు రోజులు, మరో ఆస్పత్రిలో మూడు రోజులు వైద్యసేవలను అందిస్తుంది. కనీసం నలుగురు వైద్యులు ఉండాల్సిన ఆస్పత్రిలో ప్రస్తుతం ఒక్క మెడికల్ ఆఫీసర్ మాత్రమే ఉన్నారు. దీంతో స్థానిక గర్భిణులు ప్రసవాల కోసం ఆర్మూర్ ప్రభు త్వాస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. కానీ జిల్లా సరిహద్దు ప్రాంతం నుంచి ఆర్మూర్ వెళ్లాలంటే కనీసం 50 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డీఎంహెచ్వోరాజశ్రీ గత నెలలో ఇటీవల ఆస్పత్రిని తనిఖీ చేయగా, వైద్యు నియమించి, ప్రసవాలు ప్రారంభిస్తామని పారు. కానీ ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఇప్పటికైనా కులు, ఉన్నతాధికారులు స్పందించి ఆస్పత్రిలో టనే గైనకాలజిస్ట్‌ను నియామించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

30 నెలలుగా బాల్కొండ ఆసుపత్రిలో నిలిచిన పోస్టుమార్టం సేవలు
బాల్కొండ మండల కేంద్రంలో వైద్యా . విధాన్ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభు త్వ క్లస్టర్ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం సేవలను పునరు ద్దరించాలని మండల ప్రజలు కోరుతున్నారు. బాల్కొండ ప్రభుత్వాస్పత్రిలో 1990 నుంచి పోస్ట్ మార్టం సేవలను అందిస్తున్నారు. కాగా, ఆస్పత్రిలో -గత రెండున్నరేళ్లుగా పోస్ట్‌మార్టం సేవలను నిలిపివే శారు.
ఫోరెన్సిక్ వైద్యుడు లేని కారణంగా పోస్ట్మా ర్థం సేవలను నిలిపివేసినట్లు వైద్యులు చెబుతు న్నారు. గతంలో పోస్ట్‌మార్టం సేవలను అందించా రు. అప్పుడు ఫోరెన్సిక్ వైద్యుడు లేకుండానే సేవలు నిర్వహించగా, ప్రస్తుతం ఫోరెన్సిక్ వైద్యుడు కావాలని వైద్యులు చెప్పడంపై మండల ప్రజలు విస్మయానికి గురి అవుతున్నారు. ఉమ్మడి బాల్కొండ( బాల్కొండ,ముప్కాల్, మెండోరా) మండలం నిర్మల్ జిల్లా సరిహద్దు కేంద్రంగా ఉంది.
పోస్ట్ మార్టం సేవ లను ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రిలో నిర్వహిస్తున్నారు. జిల్లా సరిహద్దులో ప్రమాదం జరిగి మరణిస్తే 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్మూర్ ఆస్పత్రికి మృ తదేహాన్ని పంపించాలి. మృతుల బంధువులకు దూర భారంతోపాటు వ్యయభారం కూడా పెరు గుతుంది. వైద్య శాఖ ఉన్నతాధికారులు స్పందిం చాలని మండల ప్రజలు కోరుతున్నారు.
