KTR | దొడ్డి కొమురయ్యకు ఘన నివాళులు

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు, తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.టి.రామారావు ఘ‌నంగా నివాళులర్పించారు. గురువారం తెలంగాణ భవన్ లో ఆయ‌న చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులర్పించారు.

ఈసంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… దొడ్డి కొముర‌య్య‌ ఆశయాలను సాధించే దిశగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరపున పోరాడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్, సంజయ్, నాయకులు రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇంచార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్, మన్నె గోవర్ధన్ రెడ్డి, రాజీవ్ సాగర్, చిరుమళ్ల రాకేష్ ,గజ్జెల నగేష్ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply