MLA | మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
MLA | మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్
MLA | మోత్కూరు, ఆంధ్రప్రభ : మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, వాటి ప్రయోజనం ప్రతి కుటుంబానికి చేరాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ( Mandula Samuel) అన్నారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం లో ఎమ్మెల్యే సామెల్ ముఖ్యఅతిథిగా పాల్గొని స్వయం సహాయక సంఘాల మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సామేల్ (Samuel) మాట్లాడుతూ రాష్ట్రంలో ఆయా సంక్షేమ పథకాలు మహిళలు కి కేటాయించి మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించిన ఘనత సీఎం రేవంత్ దేనన్నారు. గత ప్రభుత్వంలో పంపిణీ చేసిన చీరలు నాసిరకంగా ఉండడంతో వాటిని నారుమళ్లకు బెదురుగా పెట్టారని, దిష్టి బొమ్మలకే ఉపయోగపడ్డాయన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో పంపిణీ చేస్తున్న చీరలు మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా నాణ్యత, ఆకర్షణీయమైన రంగులతో చీరలను అందిస్తోందన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల,పట్టణ ప్రాంతంలో 35 లక్షల చొప్పున కోటి మంది మహిళలకు ప్రభుత్వం చీరలు అందిస్తుందన్నారు.ఇందిరమ్మ చీరలను సిరిసిల్ల నేత కార్మికులతో నేయించి వేలాదిమంది నేతకార్మికులకు ఉపాధి కల్పించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి కే దక్కిందన్నారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఏ పి డి నాగిరెడ్డి, మండల ప్రత్యేక అధికారి, ఏ పి డి సురేష్,ఏ పి డి జంగారెడ్డి, తహశీల్దార్ జ్యోతి,సింగిల్ విండో చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు, ఏ పి ఎం కిరణ్,మండల మహిళా అధ్యక్షురాలు శైలజ,గ్రామ అధ్యక్షురాలు అనిత,ఏ ఓ కీర్తి,ఆర్ ఐ సుమన్,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఫైళ్ల సోమిరెడ్డి, జిల్లా నాయకులు గుర్రం లక్ష్మీనరసింహ రెడ్డి, మండల ,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షురాలు వంగాల సత్యనారాయణ, గుండగొని రామచంద్రు,ప్రధాన కార్యదర్శి రాచకొండ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
ఫ్లెక్సీలో ఇందిరా మహిళా శక్తిని విస్మరించిన అధికారులు…
తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి పథకం కాస్త.. పాటిమట్లలో డి ఆర్ డి ఏ అధికారులు సదరు ఫ్లెక్సీలో కేవలం స్వయం సహాయక సంఘాల మహిళలకు చీరల పంపిణీ అని రాయడం…ఇందిరా మహిళా శక్తి పేరు ప్రస్తావన పొందుపరచకపోవడంతో ఆ పథకం ఉద్దేశ్యం ఏంటి అనేది ఎలా అర్ధమవుతుందని పలువురు ఆరోపిస్తున్నారు.
