ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా..
ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా..
గ్రామాల్లో ఉపాధ్యాయుల విస్తృత ప్రచారం…….
పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : స్థానిక కె.వి.ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమే లక్ష్యంగా రానున్న విద్యాసంవత్సరంలో అధికశాతం విద్యార్థులను చేర్చేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు, బోధనపై అవగాహన కల్పిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకుగాను సోమవారం మండలంలోని పలు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలను బడిలో చేర్పించేందుకు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. పాఠశాలల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. సోమవారం ఇంటింటా సర్వే చేశారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తున్నారు.
