దుర్గగుడి దర్శనం.. వాట్సప్‌లోనే బుకింగ్…

దుర్గగుడి దర్శనం.. వాట్సప్‌లోనే బుకింగ్…

మన మిత్ర’ సేవతో భక్తులకు మరింత సౌలభ్యం..
ఇంటి దగ్గర నుంచే దర్శనం, సేవలు, ఈ-హుండీ బుకింగ్..
9552300009 ద్వారా ఆలయ సేవలు అందుబాటులోకి..

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం భక్తులకు మరింత సౌకర్యం కల్పించే దిశగా దేవస్థానం కీలక అడుగు వేసింది. ఇకపై ఆలయ దర్శనం, ప్రత్యేక సేవలు, ఈ-హుండీ వంటి సేవలను ‘మన మిత్ర’ వాట్సప్ గవర్నెన్స్ సేవల ద్వారా సులభంగా బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. సాంకేతికతను భక్తి సేవలకు అనుసంధానం చేస్తూ తీసుకొచ్చిన ఈ విధానం భక్తుల్లో ఆసక్తిని కలిగిస్తోంది.

టికెట్ బుకింగ్ విధానం ఇలా…

మీ మొబైల్‌లో 9552300009 నంబర్‌ను సేవ్ చేసి వాట్సప్‌లో హాయ్ అని మెసేజ్ పంపాలి. వెంటనే వచ్చే మెనూలో ‘సేవను ఎంచుకోండి’ పై క్లిక్ చేసి, ‘దేవాలయ బుకింగ్ సేవలు’ ఎంపిక చేసి నిర్ధారించాలి. ఓపెనింగ్ ఆప్షన్ నొక్కి జిల్లా పేరులో ఎన్టీఆర్ జిల్లా ఎంపిక చేసి, ఆలయంగా శ్రీ దుర్గమల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఎంచుకోవాలి. ఇప్పుడు దర్శనం, సేవలు లేదా ఈ-హుండీలో మీకు కావలసిన సేవను ఎంపిక చేసుకోవాలి. తరువాత తేదీ, స్లాట్ ఎంపిక చేసి భక్తుల పేరు, ఆధార్ తదితర వివరాలు నమోదు చేయాలి. రివ్యూ అండ్ పేమెంట్ / పేమెంట్ నౌ నొక్కి పేమెంట్ పూర్తి చేయాలి. టికెట్ డౌన్‌లోడ్ చేసుకుని దేవస్థానంలో చూపించి సేవలను పొందవచ్చు. భక్తుల రద్దీని తగ్గిస్తూ, వేగవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ డిజిటల్ సేవ భక్తులకు మరింత ఉపయోగకరంగా మారనుంది.

Leave a Reply