Back log | ప్రవేశాల దరఖాస్తుకు రేపే చివరి తేదీ

Back log | ప్రవేశాల దరఖాస్తుకు రేపే చివరి తేదీ

  • ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ సేరు శ్రీధర్

Back log | లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సాధారణ, బీసీ, సాంఘీక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5 వ తరగతిలో అడ్మిషన్ల కోసం నిర్వహించే వీజీ సెట్, 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ సీట్ల భర్తీకి నిర్వహించే బ్యాక్ లాగ్ సెట్ దరఖాస్తు గడువు రేపటితో ముగుస్తుంద‌ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ సేరు శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు.

అర్హులైన పేద, మధ్య తరగతి విద్యార్థినీ విద్యార్థులు అవసరమైన అన్నీ సర్టిఫికెట్ లతో ఆన్లైన్ ద్వారా గాని లేదా సమీప మీ సేవ కేంద్రాల ద్వారా గాని దరఖాస్తు చేసుకోవాలని, ఫిబ్రవరి 22వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన కేంద్రాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మార్చి ఏప్రిల్ నెలలో ఫలితాలు ప్రకటించి సీట్లు భర్తీ చేస్తామని తెలిపారు.

Leave a Reply