Union Cabinet | డీఏ పెంపునకు కేంద్రం గ్రీన్‌సిగ్న‌ల్‌

Union Cabinet | డీఏ పెంపునకు కేంద్రం గ్రీన్‌సిగ్న‌ల్‌

Union Cabinet | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కరవు భత్యం (డీఏ) 2 శాతం పెంచడానికి నిర్ణయం తీసుకుంది. శనివారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మోడీ ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం 2 శాతం పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గత అక్టోబర్‌లో డీఏను 55 శాతం నుండి 58 శాతానికి పెంచగా.. తాజా నిర్ణయంతో ఇది 60 శాతానికి చేరుకోనుంది. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం నుంచి ఉద్యోగుల కొనుగోలు శక్తిని కాపాడేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా జనవరి, జూలై నెలల్లో ఈ సర్దుబాట్లు చేస్తుంది. అయితే ఈసారి డీఏ పెంపు ప్రకటన ఆలస్యమైంది. దాంతో ఉద్యోగుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. అలాగే ఈ క్యాబినెట్‌ సమావేశంలో సావరిన్ మారిటైమ్ ఫండ్ ఏర్పాటుకు కూడా ఆమోదం లభించింది.

Leave a Reply