హనుమకొండలో అగ్నిప్రమాదం
హనుమకొండలో అగ్నిప్రమాదం
గ్రౌండ్ ఫ్లోర్‌లో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు
అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది.. తప్పిన పెను ప్రమాదం
హనుమకొండ, జూన్ 15 (ఆంధ్రప్రభ): హనుమకొండలోని ఏకశిలా పార్క్ సమీపంలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకు భవనంలో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. వారి సకాల చర్యలతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.
ఇటీవల వరంగల్ బట్టల బజార్ ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంలో భారీ ఆస్తి నష్టం సంభవించిన నేపథ్యంలో, మరోసారి గ్రేటర్ వరంగల్ పరిధిలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ ఘటనలో జరిగిన ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
