దుర్గాదేవి ఆలయానికి భూమి పూజ..

ములుగు, (సిద్దిపేట జిల్లా) ఆంధ్రప్రభ : దేవుడి దయతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని శ్రీరాంపూర్ గ్రామంలో వ్యవసాయ క్షేత్రం వద్ద దుర్గాదేవి ఆలయ నిర్మాణానికి భూమి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన వెంట సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి, గజ్వేల్ మాజీ శాసనసభ్యుడు తూముకుంట నర్సారెడ్డి, వంటిమామిడి మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ గుప్తా, మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply