చోరీకి గురైన మొబైల్ ఫోన్లను బాధితులకు అప్పగింత..

కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ జీఆర్‌పీ సీఐ పి. సురేందర్ సోమవారం చోరీకి గురైన మొబైల్ ఫోన్లను సంబంధిత బాధితులకు తిరిగి అప్పగించారు.

ప్రయాణికుల నుంచి పోయిన లేదా దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ (CEIR) పోర్టల్ సహాయంతో గుర్తించి స్వాధీనం చేసుకుని, వాటిని బాధితులకు అందజేశారు.

స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లలో వన్‌ప్లస్, శాంసంగ్, వివో తదితర కంపెనీలకు చెందిన ఫోన్లు ఉన్నాయని, వాటి మొత్తం విలువ సుమారు రూ.80 వేల వరకు ఉంటుందని సీఐ పి. సురేందర్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొబైల్ ఫోన్ పోయిన వెంటనే లేదా దొంగతనానికి గురైన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్లను గుర్తించి తిరిగి పొందే అవకాశాలు అధికంగా ఉంటాయని ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విలువైన వస్తువుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఐ సూచించారు.